Mission | గోదల్‌లో జల మహోత్సవం…

Mission | గోదల్‌లో జల మహోత్సవం…

మిషన్ భగీరథ కీలకపాత్ర

Mission | అచ్చంపేట, ఆంధ్రప్రభ : బల్మూరు మండలంలోని గోదల్ గ్రామంలో మిషన్ భగీరథ ఆధ్వర్యంలో జల మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో కలిసి గ్రామంలో జల మహోత్సవం అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించడంలో మిషన్ భగీరథ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు చేరేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. నీటి సంరక్షణతో పాటు సహజ వనరుల పరిరక్షణపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయాల సంస్థ చైర్మన్ రాజేందర్, మిషన్ భగీరథ అచ్చంపేట డిఈ హేమలత, ఏఈ మధుబాబు, స్థానిక సర్పంచ్ ఇందిరమ్మ, మిషన్ భగీరథ అధికారులు, ఇతర అధికారులు, బల్మూరు మండల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Mission |
Mission |
Mission |

CLICK HERE TO READ MORE : హెచ్‌పీవీ వ్యాక్సిన్ కేంద్రం..

CLICK HERE TO READ MORE :

Leave a Reply