Nagarjuna | క్రేజీ డైరెక్టర్ నెక్ట్స్ ఏంటి..?

Nagarjuna | క్రేజీ డైరెక్టర్ నెక్ట్స్ ఏంటి..?

Nagarjuna | నాగార్జున స్పీడ్ డెసిషన్.. క్రేజీ డైరెక్టర్‌కు బంపర్ ఆఫర్?
విరూపాక్షతో సంచలనం సృష్టించిన కార్తీక్ దండు
నాగచైతన్య ‘వృషకర్మ’పై పెరిగిన భారీ అంచనాలు
అఖిల్‌తో కార్తీక్ దండు సినిమా..? నాగార్జున ప్లాన్ ఏమిటి
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో కొత్త ప్రాజెక్ట్?

Nagarjuna | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అక్కినేని నాగార్జున.. నిర్ణయాలు చాలా స్పీడుగా తీసుకుంటారు. అలాగే కొత్త వాళ్లకు ఆఫర్స్ ఇచ్చి న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తుంటారు. ఇప్పుడు నాగ్ ఓ డైరెక్టర్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారని ఇండస్ట్రీ జనాల్లో ప్రచారం జరుగుతుంది. ఆ డైరెక్టర్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. అయితే.. రిజెల్ట్ తో సంబంధం లేకుండా.. ఆ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చినట్టుగా న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ.. ఆ డైరెక్టర్ ఎవరు..? నాగ్ ఇచ్చిన ఆపర్ ఏంటి…?

Nagarjuna | మరచిపోలేని సినిమా

Nagarjuna

నాగ్ బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆ డైరెక్టర్ ఎవరంటే.. కార్తీక్ దండు. విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించాడు. ఆ సినిమా 90 కోట్లు కలెక్ట్ చేసింది. ఆడియన్స్ కి ఓ కొత్త థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే.. సాయి దుర్గ తేజ్ కెరీర్ లో ఎప్పటికీ మరిచిపోలేని సినిమాగా నిలిచింది. అలాగే కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందించింది. నెక్ట్స్ మూవీగా కార్తీక్ దండు వృషకర్మ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ మూవీని సీనియర్ ప్రొడ్యూసర్ బివీఎస్ఎన్ ప్రసాద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Nagarjuna | అఖిల్, కార్తీక్ దండు సినిమా..

Nagarjuna

ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఎక్స్ పెక్టేషన్స్ మరింతగా పెరిగాయి. నాగచైతన్య.. తన కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ అని.. క్లైమాక్స్ అయితే.. ఇండియన్ స్క్రీన్ పై గుర్తుండిపోతుందని చెప్పాడు. చైతన్య తన సినిమాల గురించి ఎప్పుడూ అంతలా మాట్లాడింది లేదు. ఈ సినిమా విషయంలో అలా మాట్లాడి అంచనాలు మరింతగా పెంచేసారు. కార్తీక్ దండు గురించి అయితే.. జీవితాంతం మాట్లాడతానని చెప్పాడు. ఇక అసలు విషయానికి వస్తే.. కార్తీక్ దండు టాలెంట్ గుంచి తెలుసుకున్న నాగార్జున.. అఖిల్ తో సినిమా చేయమని అడిగారట. దీనికి వెంటనే కార్తీక్ దండు చేస్తానని ప్రామిస్ చేశారట. ఈ చిత్రాన్ని నాగార్జున అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైనే నిర్మిస్తాన‌ని చెప్పారట. మరి.. ఇది నిజమౌతుందో లేదో చూడాలి.

Nagarjuna

click here to read

click here to read more

Leave a Reply