మంత్రి అడ్లూరికి మరో కీలక బాధ్యత..

మంత్రి అడ్లూరికి మరో కీలక బాధ్యత..

  • గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు మంత్రుల సబ్ కమిటీ..
  • సభ్యులుగా మంత్రి అడ్లూరికి అవకాశం
  • ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన లక్ష్మణ్ కుమార్

ధర్మపురి, ఆంధ్రప్రభ : రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్కు మరో కీలక బాధ్యతను అప్పగించారు. తెలంగాణ ప్రభుత్వం గోదావరి పుష్కరాలు – 2027 నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకొని పుష్కరాల ఏర్పాట్లు, నిర్వహణను పర్యవేక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీ- మంత్రుల ఉప సంఘంను ఏర్పాటు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2027లో రాబోయే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించింది.

ఇందులో భాగంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన 9 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఉత్తర్వులు విడదుల చేశారు. ఈ కమిటీలో కీలక శాఖల మంత్రులకు చోటు కల్పించగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ని సైతం సభ్యులుగా నియమించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పుష్కర ఏర్పాట్ల పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు అవకాశం దక్కడం పట్ల ధర్మపురి నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిర్వహించిన మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర ఏర్పాటు పనుల్లో సైతం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. తక్కువ సమయంలోనే మేడారం జాతర పనులు పూర్తిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగా కలగకుండా చూడడంలో సఫలమయ్యారు. ఈ నేపథ్యంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై వేసిన సబ్ కమిటీలో అడ్లూరి పై నమ్మకంతో క్యాబినెట్ సబ్లో మంత్రి లక్ష్మణ్ కుమార్ సభ్యులు పని చేసే అవకాశం ప్రభుత్వం కల్పించింది. తనపై నమ్మకంతో గోదావరి పుష్కరాలకు వేసిన సబ్ కమిటీలు సభ్యుడిగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply