Inspections | భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం

Inspections | భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం
Inspections | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కరీంనగర్‌లో ఏసీబీ మెరుగు దాడులు కలకలం రేపాయి. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ శ్రావణ్ ఇంట్లో ఏసీబీ అధికారులు ఇవాళ ఉదయం తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు, అక్రమ సంపదలు ఉన్నాయన్న ఆధారాలతో ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.
తనిఖీల సమయంలో భారీగా నగదు, కీలక పత్రాలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ దాడి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అధికారులు, ఉద్యోగుల మధ్య భయాందోళన నెలకొన్నట్లు స్థానిక వర్గాలు తెలిపాయి.
