సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మాజీ రాజ్యసభ సభ్యులు..

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మాజీ రాజ్యసభ సభ్యులు..
మోపిదేవి, ఆంధ్రప్రభ : మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సుప్రీంకోర్టు అడిషనల్ సోలిటర్ జనరల్, మాజీ రాజ్యసభ సభ్యులు కనక మేడల రవీంద్ర కుమార్ శుక్రవారం దర్శించుకున్నారు. తొలుత నాగపుటలో పాలు పోసి ప్రత్యేక పూజలను ఆయన నిర్వహించారు. వీరికి స్వామివారి చిత్ర పటాన్ని, తీర్థ ప్రసాదాలు ఆలయ సూపర్డెంట్ అచ్యుత మధుసూదన్ రావు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
