నాన్ టీచింగ్ స్టాఫ్ పై విద్యార్థి దాడి…

నాన్ టీచింగ్ స్టాఫ్ పై విద్యార్థి దాడి…

గన్నవరం, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లీ జడ్పీ హైస్కూల్ పదోతరగతి విద్యార్థులకు రెండు రోజుల క్రితం నాన్ టీచింగ్ స్టాఫ్ మధ్య మరుగుదొడ్ల‌ విషయంలో జరిగిన ఘర్షణ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాన్ టీచింగ్ స్టాఫ్ ఓ విద్యార్ధి తల్లిని దుర్భాషలాడటంతో నాన్ టీచింగ్ స్టాఫ్ పై దాడి చేశాడు.

ఈ ఘటనపై వీరవల్లి పోలీసు స్టేషన్ లో ఇరువురు ఫిర్యాదు చేశారు. అనంతరం ఇరువర్గాలు రాజీ పడి ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Leave a Reply