త‌క్కువ మార్కులు రావ‌డంతో…

త‌క్కువ మార్కులు రావ‌డంతో…

మ‌న‌స్తాపానికి గురై ఆత్మ‌హ‌త్య‌…

మ‌చిలీప‌ట్నం, ఆంధ్ర‌ప్ర‌భ : ఇంటర్మీడియట్ ఫలితాలు ఓ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చిన హృదయ విదారక ఘటన. మచిలీపట్నం లక్ష్మణరావుపురానికి చెందిన పసిడి నరసింహ కుమార్తె నాగజ్యోతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఈరోజు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఒక సబ్జెక్టులో తక్కువ మార్కులు రావడంతో మనస్తాపానికి గురైన ఆమె, ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు బంధువులు తెలిపారు.

నాగజ్యోతి రేపల్లిలోని క్రిస్టియన్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతోంది. ఘటనను గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అమాయకమైన ఆమె తల్లి నా కూతురికి వైద్యం చేయండి బతికే ఉంది అంటూ రోదిస్తున్న సంఘటన స్థానికులను కన్నీరు తెప్పిస్తున్న పరిస్థితి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply