హోలీ సంబరాలు

హోలీ సంబరాలు

ఐటీడీఏ పీవోకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాదులు

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం న్యాయవాదులు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా న్యాయవాదులు కోర్టు వెలుపల రంగులు పూసుకొని ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం సబ్ కలెక్టర్ ఇంచార్జి పీవో యువరాజ్ మర్మాట్ కు సీనియర్ న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలోన్యాయవాదులు ధీరజ్ గుప్తా, పెందూర్ ప్రభాకర్, బి.జైవంత్ రావు, పి. వసంత్ రావు, కుడెల్లి అశోక్ విశాల్ జాదవ్, మానాల లక్ష్మీనారాయణ, దుర్వ మహేష్ పాల్గొన్నారు.

Leave a Reply