8 Smugglers | 8 టన్నుల దుంగలు..

8 Smugglers | 8 టన్నుల దుంగలు..

8 Smugglers | తిరుపతి (రాయలసీమ) ఆంధ్రప్రభ : తిరుపతి కేంద్రంగా పని చేసే ఎర్ర చందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ కర్ణాటక రాష్ట్రంలో  నిర్వహించిన దాడిలో రూ 5 కోట్ల విలువైన 8 టన్నుల ఎర్ర చందనం దుంగలు, 8 మంది అంతర్ రాష్ట్ర స్మగ్లర్స్ పట్టుబడినట్టు టాస్క్ ఫోర్స్ హెడ్ గా వ్యవహరిస్తున్న తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎల్ సుబ్బారాయుడు వెల్లడించారు. సోమవారం ఇక్కడి టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఏర్పాటు సమావేశంలో ఆయన వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

ఒక పాత నేరానికి సంబంధించి పరారీలో ఉన్న ముద్దాయిల కోసం ఇంటెలిజెన్స్ వారి సహకారంతో సేకరించిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది కర్ణాటక పోలీసుల సహకారంతో నిన్న సాయంత్రం కర్నాటక రాష్ట్రం, హస్సన్ జిల్లా, అర్సికేరిత తాలుకా, సిద్దాపూర  హరత్నాహళ్లి గ్రామంలోని ఒక గోడౌన్ పై దాడి చేశారు. అక్కడ మూడు వాహనాలతో సిద్ధంగా ఉన్న కొంత మంది వ్యక్తులు పోలీసు వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. 

8 Smugglers |

వారిని వెంటాడిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది  చాకచక్యంగా వారిలో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన  సమాచారం మేరకుఅక్కడి  కోళ్ళఫారం లాంటి ఓపెన్ రేకుల షేడ్ ను తనిఖీ చేయగా అందులో 195 ఎర్రచందనం దుంగలు, రీపర్లు , ఇతర స్క్రాప్ తో పాటు రవాణా కి ఉపయోగించిన మూడు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

8 Smugglers |

పట్టుబడిన దుంగల విలువ రూ 5 కోట్లు ఉంటుందని పేర్కొన్న ఎస్పీ సుబ్బారాయుడు పరారీలో ఉన్నవారిలో ప్రధాన స్మగ్లర్లు ఉన్నట్టు తెలిసిందని, వారికోసం  ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కేసు లో ఎర్ర చందనం దొంగలు, వాహనం ను స్వాధీనం చేసుకోవడంతో పాటు, 8 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ బృందాన్ని అభినందించడం తో పాటు వారికి రివార్డ్ లు ఇస్తామని ప్రకటించారు.

Leave a Reply