Incident | ఎగిసిపడ్డ మంటలు

Incident | ఎగిసిపడ్డ మంటలు
Incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్ష్మీదేవిపల్లిలో ఉన్న స్టీల్ కంపెనీలో పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా బట్టీ పేలడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ఘటనతో కార్మికులు, స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదం సంభవించిన వెంటనే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది బయటకు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. అధికారులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనతో పరిశ్రమ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
