పేకాట రాయుళ్లపై పోలీసుల మెరుపు దాడి

పేకాట రాయుళ్లపై పోలీసుల మెరుపు దాడి

స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన 9 మంది అరెస్ట్
రూ.4,220 నగదు, మూడు ద్విచక్ర వాహనాల స్వాధీనం
మిగతా పేకాట రాయుళ్లను వెంటాడి పట్టుకున్న పోలీసులు
ఎస్‌ఐ రాజేష్ నేతృత్వంలో ఆకస్మిక తనిఖీలు
చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు : సీఐ జి. వేణు

స్టేషన్ ఘన్ పూర్,ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మండలం కొత్తపల్లి క్రాస్‌రోడ్డు రిజర్వాయర్ సమీ పంలోని మామిడి తోట ఒక్కసారిగా పోలీసుల కదలికలతో కలకలం రేపింది. నిశ్శబ్దంగా పేకాట సాగుతున్న ఆ ప్రదేశంలో పోలీసులు మెరుపువేగంతో ప్రవేశించడంతో పేకాట రాయుళ్లు ఒక్కసారిగా పారి పోయారు. పోలీసులు అక్కడికి చేరుకున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు స్పాట్‌లోనే పట్టుబడ్డారు. మిగిలిన వారు పారిపోవడానికి ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల చాకచక్యం ముందు వారి ప్రయ త్నాలు ఫలించలేదు. క్షణాల్లోనే పారిపోతున్న వారిని వెంబడించి అదు పులోకి తీసుకోవడంతో మొత్తం తొమ్మిది మంది పేకాట రాయుళ్లు పోలీసుల వలలో చిక్కారు.

పేకాట రాయుళ్లు తొమ్మిది మంది అరెస్ట్

పేకాట రాయుళ్ల ఘటనపై సీఐ జి.వేణు ఆదివారం ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌ఐ రాజేష్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది. పోలీసు సిబ్బంది తో ఎస్ఐ అక్కడికి చేరుకో గానే ముగ్గురు వ్యక్తులు స్పాట్‌లోనే పట్టు బడ్డారు. మిగిలిన వారు తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఎస్‌ఐ రాజేష్ చాకచక్యంగా వ్యవహరించి వారిని కూడా వెంటనే అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

పేకాటలో పాల్గొన్న మునిగెల యాకన్న, నీరటి కర్ణాకర్, నీల శంకర్, మునిగేల రవి, గోనెల యాదగిరి, మునిగేల అయి లయ్య, నీల కృష్ణ, నీల సాంబరాజు, బాలబోయిన బిక్షపతి వీరంతా స్టేషన్ ఘన్‌పూర్ గ్రామానికి చెందినవారిగా గుర్తించామని చెప్పారు. ఈ సందర్భంగా పంచనామా నిర్వహించి పేకాటకు వినియోగించిన రూ.4,220 నగ దుతో పాటు మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ ఘటనపై తొమ్మిది మందిని అరెస్ట్ చేసి వారిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.అనంతరం ఎస్ఐ రాజేష్ తో పాటు పోలీస్ సిబ్బందిని సీఐ వేణు అభినందించారు.

Leave a Reply