tention| ఇరాన్‌లో తెలుగు విద్యార్థులు

tention| ఇరాన్‌లో తెలుగు విద్యార్థులు
వార్ నేపథ్యంలో భయానక వాతావరణం
ఇంటర్‌నెట్, మొబైల్ నెట్‌వర్క్ కట్
సమాచారం లేక ఆందోళనలో తల్లిదండ్రులు
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్దంతో హైదరాబాద్ నగర వాసుల్లో భయాందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ కు చెందిన 900 మంది విద్యార్థులు ఇరాన్ లోని టెహ్రాన్, కుం నగరాల్లో చదువుకుంటున్నారు. శనివారం ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడితో ఒక్కసారిగా నగరంలోని పాతబస్తీ , టోలీచౌకి ప్రాంతాల్లోని ఆయా విద్యార్థులను పేరెంట్స్ ఆందోళనకు గురయ్యారు.
విద్యార్థులే కాకుండా, ఇంజనీర్లు, వ్యాపారులు, వివిధ పనుల నిమిత్తం వెళ్ళిన వారు కలిపి మొత్తం తెలంగాణ నుంచి సుమారు 2 వేల మంది ఇరాన్‌లో ఉన్నట్లు సమాచారం. వీరిలో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారే. యుద్ధం నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు మొబైల్ నెట్‌వర్క్‌పై కూడా ఆంక్షలు విధించింది. దీంతో గత 24 గంటలుగా అక్కడ ఉన్న విద్యార్థుల యోగ క్షేమాల గురించి తెలియక వారి తల్లిదండ్రులకు ఆందోళనకు గురవుతున్నారు. పిల్లల ఫోన్లు కలవడం లేదు.. వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో తెలియడం లేదని ఆందోళన చెందుతున్నారు.
