బిజెపి కౌన్సిలర్లకు సన్మానం..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ నుండి గెలుపొందిన బిజెపి కౌన్సిలర్లు బొట్ల సంపత్, పాశికంటి సంపత్ లను శుక్రవారం పలువురు సన్మానించి అభినందించారు. పట్టణ బిజెపి అధ్యక్షుడు నంద గంగేష్, పార్టీ నేతలు చిరిగే శ్రీనివాస్, సత్యనారాయణ, సంఘ భూపతి, ఎనగందుల సురేష్, ఎలగల వెంకటేష్, పలువురు ముఖ్య నాయకులు,కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
