MLA | జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వం ఒక బాధ్యత…

MLA | జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వం ఒక బాధ్యత…

ఒక నిబద్ధత, ఒక సంకల్పం

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
జనసేన సభ్యత్వ నమోదు శిబిరాలు ప్రారంభించిన ఎమ్మెల్యే
సభ్యత్వ నమోదు శిబిరాలకు విశేష స్పందన

MLA | అవనిగడ్డఆంధ్రప్రభ : జనసేన పార్టీ ‘ఉద్యమి’ సభ్యత్వం కేవలం ఒక రాజకీయ పార్టీ మెంబర్షిప్ కాదని, ఇది ఒక బాధ్యత, ఒక నిబద్ధత, ఒక సంకల్పం అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం అవనిగడ్డలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కార్ల స్టాండ్, చింతచెట్టు సెంటర్లలో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు శిబిరాలను ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. ఆసుపత్రి డైరెక్టర్ బచ్చు కృష్ణకుమారి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వాన్ని రెన్యూవల్ చేసి పత్రాలను ఆయనకు అందచేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సమాజం మంచిగా మారాలి, రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాలి, రేపటి తరానికి విలువలతో కూడిన భవిష్యత్తు ఉండాలనే ఆలోచనతో యువత జనసేన పార్టీ ఉద్యమ‌ సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తి, నిస్వార్థ సేవా భావం, సామాన్య ప్రజల పట్ల ఉన్న కట్టుబాటు ప్రతి ఒక్కరికీ ఎంతో ప్రేరణనిస్తాయన్నారు. రాజకీయాలు అంటే కేవలం పదవులు కాదని, ప్రజల కోసం నిలబడటం, సమస్యలపై స్వరం వినిపించడం, అన్యాయం జరిగితే ప్రశ్నించడం అనే నమ్మకం తనకుందన్నారు.

MLA |

ఆ నమ్మకానికి ఈ ‘ఉద్యమి’ సభ్యత్వం ఒక మొదటి అడుగు అని తెలిపారు. సమాజంలో మార్పు రావాలంటే మనమే మారాలని, మంచి నాయకత్వం రావాలంటే మంచి ఆలోచనలతో ముందుకు వచ్చే యువత అవసరమన్నారు. అందుకే సమాజం బాగుపడాలని కోరుకునే ప్రతి ఒక్కరూ, మార్పు కోసం ఎదురు చూస్తున్న ప్రతి యువకుడు, యువతి కూడా ‘ఉద్యమి’ సభ్యత్వం తీసుకుని ఈ మార్పు ప్రయాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కలిసికట్టుగా ముందడుగు వేస్తేనే నవ సమాజం సాధ్యమవుతుంది అన్నారు. మన శక్తి, మన ఐక్యతే మన బలమని, కలిసికట్టుగా నడిచి, బాధ్యతగా పనిచేసి, భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు. అధినేత, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఇచ్చిన మార్గదర్శకాలు అనుసరించి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించాలని పార్టీ సాధకులకు సూచించారు.

MLA |

కార్యక్రమంలో నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, మత్స్యకార విభాగం రాష్ట్ర కార్యదర్శి లంకె యుగంధర్, జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు బచ్చు వెంకట్ నాధ్ ప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు బొప్పన భాను, కటికల బాలాజీ, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజనాల వీరబాబు, మండల ప్రధాన కార్యదర్శి బచ్చు శ్రీహరి, మండల ఉపాధ్యక్షులు తుంగల నరేష్, జిల్లా కర్రసాము అసోసియేషన్ అధ్యక్షులు సింహాద్రి పవన్, పీఏసీఎస్ చైర్మన్ యలవర్తి చిన్నా, ఆసుపత్రి డైరెక్టర్ బచ్చు కృష్ణకుమారి, దేవస్థానాల డైరెక్టర్లు కోసూరు అవినాష్, మత్తి శివపార్వతి, మండల పార్టీ కార్యదర్శి పప్పుశెట్టి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు కమ్మిలి మారిబాబు, కమ్మిలి సాయి భార్గవ, గుగ్గిలం అనీల్, గుగ్గిలం గాయత్రి, పెనుమాక రమేష్, ఆకుల నవీన్, బాలమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆయా శిబిరాలకు పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి తమ సభ్యత్వాలు రెన్యూవల్ చేయించుకున్నారు. అభిమానులు నూతన సభ్యత్వాలు పొందారు.

Leave a Reply