ఆరు నెలల్లో చెత్త రహిత మక్తల్ – ప్రజలందరి భాద్యత

ఆరు నెలల్లో చెత్త రహిత మక్తల్ – ప్రజలందరి భాద్యత

  • మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శైవిరెడ్డి

మక్తల్ , ఆంధ్రప్రభ ; నారాయణ పేట జిల్లా మక్తల్ లో ఒకవైపు కోట్ల రూపాయలతో మంత్రి రోడ్లు,డ్రైనేజీలు నిర్మిస్తూనే ఉన్నారు.పట్టణ రూపురేఖలే మారుస్తున్నారు.మరోవైపు మన అవసరాలకోసం తవ్వుతూనే ఉన్నాం. డ్రైనేజీలలో నీళ్లు పోలేక మురికికూపాలుగా మారుతున్న చెత్తంతా అందులోనే వేస్తున్నాం.
ఇకనుంచి ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తామంటే కుదరదు.చెత్తంతా రోడ్లపైన పారబోస్తామంటే చూస్తూ ఊరుకోరు.ఇది నీ మక్తల్,బాధ్యత గల గౌరవప్రద వ్యక్తులు, విజ్ఞులు మీరు. పరిశుభ్ర మక్తల్ మన అందరి కర్తవ్యం.ఒక్కరితో ఏదికాదు,అందరు కలిస్తే అనుకున్నది సాకారం అవుతుంది.ఆలోచించండి చెత్త రహిత మక్తల్ ఏర్పాటు చేసుకుందాం అంటూ పిలుపునిచ్చారు. మక్తల్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శైవిరెడ్డి గురువారం ఆమె మీడియా తో మాట్లాడుతూ.. ఆరు నెలల్లో ఆరు బయట చెత్త ఉండొద్దు.ఒక చిన్న బీడీ ముక్క,చాక్లెట్ పేపర్ కూడా కనబడొద్దు. అందుకు ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి.

మక్తల్ పట్టణాన్ని ప్రేమించే, అభిమానించే ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వండి అంటూ పట్టణ ప్రజలను అభ్యర్థించారు. మంచి చేసే మాత్ర చేదుగా ఉంటుంది. మంచి నిర్ణయాలు కూడా కఠినంగానే ఉంటాయి.అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ సహకరించండి అంటూ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శైవిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ పట్టణం మీది మాది మన అందరిదీ మన పట్టణం పరిశుభ్రత మన అందరి బాధ్యత కాదా? ఆలోచించండి చెత్త రహిత మక్తల్ సాకారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కండి ఈ ప్రక్రియలో ప్రజలంతా భాగస్వాములు అవుతారు.

అన్న పూర్తి విశ్వాసం తనకుందని వందకు లక్ష రెట్ల నమ్మకం తమకు ఉందని ఆరు నెలల్లో చెత్త రహిత మక్తల్ సాధిస్తామని అన్నారు. ఇది నా ఒక్కరితోనో మున్సిపల్ పాలకవర్గంతోను మున్సిపల్ అధికారులు సిబ్బందితో సాధ్యం కాదు ప్రజలందరి సహకారం కావాలి మరోసారి మీ అందరితో వేడుకుంటున్నా చెత్త రహిత మక్తల్ ఏర్పాటుకు అందరూ సహకరించండి. స్థానిక ఎమ్మెల్యే మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో పట్టణంలో పూర్తి మౌలిక వసతులు కల్పించి అభివృద్ధిలో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అన్నారు.అందుకే జిల్లాకే కాదు తెలంగాణకే ఆదర్శంగా నిలుద్దాం అంటూ వైస్ చైర్పర్సన్ శైవిరెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply