ఘనంగాస్వయంపరిపాలన దినోత్సవం..

ఘనంగాస్వయంపరిపాలన దినోత్సవం..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లాఊట్కూర్ మండల పరిధిలోని పెద్దపోర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా పాఠాలు బోధించడం ఎంతగానో ఆకట్టుకుంది. విద్యార్థులు చక్కని బోధనోపకరణాలు ఉపయోగిస్తూ చాలా చక్కగా బోధన చేయడం అందరిని ఆకట్టుకుంది. ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో కలెక్టర్ గా కళ్యాణి, జిల్లా విద్యాధికారిగా విజయ్ ,
మండల విద్యాధికారిగా అరవింద్ , పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా మనీష వ్యవహరించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బోయిన్ పల్లి కాశమ్మ మాట్లాడుతూ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింగప్ప, పాఠశాల చైర్మన్ అనురాధ ,శివరాణి భాయ్ లు మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా పాఠాలు బోధించడంజరిగిందని అభినందించారు. నిజ జీవితంలో కూడా గొప్ప గొప్ప లక్ష్యాలు పెట్టుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయని కొనియాడారు. అనంతరం విద్యార్థులకు బహుమతి ప్రధానంచేశారు.ఈ కార్యక్రమంలో సీఆర్పి రాజశేఖర్ , ఉపాధ్యాయులు నరేందర్ , రాజశేఖర్, కృష్ణ,రాజశ్రీ, అశోక్ , సాయిపూజ , గ్రామస్తులు నరేష్ , వెంకటేష్ ,కృష్ణయ్య , మాల శ్రీనివాస్, మద్దెలబండ బాలు తదితరులు పాల్గొన్నారు.
