YS Jagan | ఘ‌న స్వాగ‌తం ప‌లికిన అభిమానులు

YS Jagan | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ నెల్లూరుకు చేరుకున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మాజీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ నేత కొండూరు అజయ్‌ రెడ్డి (రైల్వే కోడూరు) కుమారుడి వివాహ వేడుకకు ఆయ‌న హాజరయ్యారు. ఈ క్రమంలో వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు సిద్దు సుష్మా, ప్రతుల్య రెడ్డిలను వైఎస్‌ జగన్‌ ఆశీర్వదించారు. వైఎస్‌ జగన్‌ నెల్లూరుకు చేరుకున్న సందర్బంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హెలీప్యాడ్‌ వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన నాయకుడు వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికారు.

YS Jagan

Leave a Reply