బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్..

బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్..
- ఇద్దరు మావోయిస్టులు మృతి
- భారీగా ఆయుధాలు స్వాధీనం
చర్ల,ఆంధ్రప్రభ : ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఇంద్రావతి ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన జంగ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నట్లు జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు.
