Missing | నిజాంసాగర్‌లో ఆందోళనకర ఘటన

Missing | నిజాంసాగర్‌లో ఆందోళనకర ఘటన

Missing | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో తండ్రి, ఇద్దరు చిన్నారులు గల్లంతైన ఘటన ఆందోళన కలిగిస్తోంది. గల్లంతైన వారిని సంగారెడ్డి జిల్లా నిజాంపేటకు చెందిన కృష్ణ (32), ఆయన కుమార్తె అనన్య, కుమారుడు రక్షిత్‌గా గుర్తించారు.

ముగ్గురు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిజాంసాగర్ పరిసర ప్రాంతాల్లో గాలింపు కొనసాగుతుండగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.