ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి ..

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి ..
టి పి యూఎస్ చిట్యాల మండల శాఖ డిమాండ్,
చిట్యాల, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, సిపిఎస్ ను వెంటనేరద్దు చేయాలని ,టి పి యూఎస్ చిట్యాల మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సట్లపల్లి మధు, లకుం రంజిత్ కుమార్ కోరారు. బుధవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో చిట్యాల హై స్కూల్ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్ రఘుపతి చేతుల మీదుగా టి పి యూఎస్ మండల టేబుల్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు .
ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మధు , రంజిత్ కుమార్ లు మాట్లాడుతూ డి ఎ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, హెల్త్ కార్డులను ఉద్యోగ ఉపాధ్యాయులకు నగదు రహిత వైద్యం అందించే విధంగా అమలు చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో, రాష్ట్ర బాధ్యులు మారబోయిన మహేందర్, జిల్లా ఉపాధ్యక్షులు ఏదుల మనోహర్ ,జిల్లా కార్యదర్శి కానుగుల రఘుపతి, గోపగాని భాస్కర్, బుర్ర సదయ్య, రఘునాథ రెడ్డి, మండల కోశాధికారి ప్రవీణ్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు సుధాకర్, కల్పన, మండల కార్యదర్శిలు వి, రజిత, బి రజిత, తోట సతీష్, జిల్లా బాధ్యులు సాధు మమత, లక్ష్మీపతి, రాజు , తదితరులు పాల్గొన్నారు.
