స్వామి గౌడ్‌కు అధికారుల ఘన నివాళి..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మామ మొగుదాల స్వామి గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ నేపథ్యంలో బుధవారం చౌటుప్పల్ మండల తహసీల్దార్ వీరాభాయి తదితర అధికారులు చైర్మన్ నివాసానికి వెళ్లి స్వామి గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ మరియు కుటుంబ సభ్యులను తహసీల్దార్ పరామర్శించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరామర్శించిన వారిలో ఆర్‌ఐలు బాణాల రామ్‌రెడ్డి, కొప్పుల సుధాకర్‌రావు, సర్వేయర్ మురళి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెవగోని వెంకటేష్ గౌడ్, బొంగు రమేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Leave a Reply