గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు..

ఎడపల్లి, ఆంధ్రప్రభ ; ఎడపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఎడపల్లి ఎంపీడీవో శంకర్ మంగళవారం తెలిపారు. మండల వ్యాప్తంగా మొత్తం 166 మంది వార్డు సభ్యులకు రెండు విడుదలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే నిధులు, వాటిని వెచ్చించే వాటిపై శిక్షణ ఉంటుందన్నారు. ఎంపీడీవో శంకర్, ఎంపిఓ మన్మోహన్ శాస్త్రి, టీఓటీలు క్యాతప్ప, శ్రీనివాస్, ఈశ్వర్, రామకృష్ణయ్య, పంచాయతీ కార్యదర్శులు వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు.

