ప్రధాన రహదారిపై నెలలుగా నిర్వహణ శూన్యం

డోంగ్లీ, ఆంధ్రప్రభ ; ఇదేదో చిన్న గ్రామ రోడ్డు అనుకుంటే మీ పొరపాటే. ఇది డోంగ్లి నుండి బిచ్కుందకు వెళ్లే ప్రధాన రహదారి నిత్యం వందల వాహనాలు, ఆర్టీసీ బస్సులు, లారీలు, వ్యవసాయ వాహనాలు, స్కూల్ వాహనాలు రాకపోకలు సాగించే కీలక రూటు అయితే రోడ్డు పక్కన పెరిగిన ముళ్ల పొదలు నెలలుగా తొలగించకపోవడంతో రోడ్డు మీదకు వచ్చి సగం రోడ్డును మింగేస్తున్నాయి.
దీంతో రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే సైడ్ ఇచ్చేందుకు చోటు లేకుండా పోయింది,ఇది ప్రధాన రహదారి సార్ పగలు కూడా రెండు వాహనాలు ఎదురైతే ఒకటి పొదల్లోకి దిగాల్సి వస్తోంది,ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు అని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు భద్రతకు ఇది తీవ్ర ప్రమాదం. ఆర్అండ్ బి ఏఈ వివరణ కోరగా అధికారులు దృష్టికి తీసుకెళ్లి ముళ్ళ పోదాలు తొలగించేస్తామని అన్నారు,కానీ ఆలస్యం చేయకుండా ఆర్ అండ్ బి అధికారులు ఇప్పటికైనా స్పందించి పొదలను తొలగించాలని పరిసర గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
