సత్తా చాటిన గురుకుల విద్యార్థులు..

సత్తా చాటిన గురుకుల విద్యార్థులు..

మంథని టౌన్, ఆంధ్రప్రభ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల (బాలురు) మంథని విద్యార్థులు రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సత్తా చాటారు. పిడి రమేష్ పిఇటి పుష్పలత ఆధ్వర్యంలో విద్యార్థులు బాల్ బ్యాట్మెంటన్, షటిల్, ఖోఖో, కబడ్డీ, విభాగాలలో ప్రతిభ కనబరిచారు. ప్రతిభ చాటిన విద్యార్థులను పెద్దపెల్లి జిల్లా గురుకులాల సమన్వయ అధికారి, మంథని గురుకుల ప్రిన్సిపల్ శ్రీనాథ్, సీనియర్ వైస్ ప్రిన్సిపల్ నవీన్, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ రవి, బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు.

Leave a Reply