నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు

నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు
జైనూర్, ఆంధ్రప్రభ : వాహనదారులు రోడ్డు నిబంధనలు వాహన నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జైనూర్ సిఐ రమేష్ అన్నారు. కొమరం భీ0 ఆసిఫాబాద్ జిల్లా ఎస్బిఐ ఎస్పీ ఆదేశాల మేరకు జై నూర్ మండల కేంద్రంలో సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో అలై అరయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ మాట్లాడుతూవాహనదారులు వాన పత్రాలు కలిగి ఉండాలని ఎలిమెంట్ ధరించి ఈ చక్ర వాహనాలను నడపాలని వాహనాల అన్ని రకాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు కలిగి ఉండాలని ఆయన కోరారు.
ద్విచక్ర వాహనాలు నడిపేవారు ఎలిమెంట్ ధరించి నడపాలని నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దాదాపు పత్రాలు లేని నెంబర్లు లేని కొన్ని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసు చేసుకున్నామని వాహనాల పత్రాలు పరిశీలించిన తర్వాత వాహనదారులకు వాహనాలను అప్పగించడం జరుగుతుందని పత్రాలు లేని వాహనాల దారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఐ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జైనూర్, సిర్పూర్ (యు )లింగాపూర్ ఎస్ఐలు రవికుమార్, రామకృష్ణ, గంగన్న పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు.
