రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం.

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం.

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు

కడెం, ఆంధ్రప్రభ : రైతుల సంక్షేమమే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వ ధ్యేయమని, రైతులను రాజులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమా బొజ్జు అన్నారు. బుధవారం కడెం మండలంలోని పెద్దూరు తండా గ్రామం వద్ద ఏర్పాటు చేసిన వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే బొజ్జు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని దళారులకు విక్రయించి నష్టపోవద్దన్నారు. రైతులు పంట ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి లబ్ధి పొందాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పి భూషణ్, ఖానాపూర్ ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యనారాయణ, ఖానాపూర్ ఏ డి ఏ సుజాత, సర్పంచుల ఫోరం, కడం మండల అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు టి మల్లేష్, డిసిసి కార్యదర్శి బి దేవేందర్ గౌడ్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బి రమేష్ వర్మ, డిసిసి మెంబర్ గొల్ల వెంకటేష్, పెద్దూర్ కడెం బెల్లాల్, చిట్యాల్ గ్రామాల సర్పంచులు దీకొండ విజయకుమార్, బొంతల లక్ష్మీ, భూమన్న, చీమల భీమేష్, కడం ఎం ఏ ఓ దినేష్, పిఎసిఎస్ సెక్రటరీ ఆశన్న, పెద్దూర్ ఉపసర్పంచ్ పిట్టల రాజన్న, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బొడ్డు గంగన్న, కొండాపురం లక్ష్మణ్, తక్కల్ల సత్తన్న, తొట్ల గంగాధర్, బబ్లు, సమ్మెట రాజన్న, ఎండి షర్ఫుద్దీన్, సిహెచ్ రాజేష్, చెన్ను మల్లేష్, అత్రం శ్రీనివాస్, బైరి శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply