25న ఉచిత కంటి వైద్యశిబిరం…

25న ఉచిత కంటి వైద్యశిబిరం…
- సీఐ చరమందరాజు
హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : పట్టణంలోని టౌన్ హాల్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 25 న అరైవ్ అండ్ అలైవ్ కార్యక్రమం లో భాగంగా హుజూర్‌నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలోని లైసెన్స్ డ్రైవర్లకు ఉచితంగా కంటి వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ చరమందరాజు తెలిపారు.
సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సర్కిల్ పరిధిలోని సిమెంట్ పరిశ్రమల ట్రాన్స్ పోర్ట్, లారీ అసోసియేషన్, ఆటో డ్రైవర్లు, స్కూల్ బస్, క్యాబ్ డ్రైవర్లుకు ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన సీనియర్ కంటి వైద్య నిపుణులతో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమగు వారికి ఉచితంగా మందులు కళ్ళ అద్దాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ కే.నరసింహ, కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి లు హాజరు కానున్నారని తెలిపారు. ఇట్టి అవకాశాన్ని డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని సీఐ చరమందరాజు కోరారు. ఈ సమావేశంలో ఎస్ఐ మోహన్ బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
