రాజసింగ్ ను అరెస్ట్ చేయడం దుర్మర్గం…

రాజసింగ్ ను అరెస్ట్ చేయడం దుర్మర్గం…

రాజాసింగ్ తోనే చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ
పోలీసులు రాజాసింగ్ అడ్డుకొని అరెస్టు చేయడం సరికాదు
సర్పంచులు బిజెపి నాయకులు

కుంటాల, ఆంధ్రప్రభః నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హైదరాబాద్ నుండి వస్తున్న గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను సబాబు కాదని ఓలా గ్రామంలోని స్థానిక సర్పంచులు బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం కుంటాల సర్పంచ్ జక్కుల గజేందర్ మాట్లాడుతూ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణకు విచ్చేయుచున్న గోషా మాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు మెదక్ జిల్లా శంకరంపేట పోలీసులు అరెస్టు చేయడం అన్యాయమన్నారు.


చత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ రాజాసింగ్ వచ్చేంతవరకు ఆవిష్కరణ చేసేది లేదని వారు తేల్చి చెప్పారు అధర్య పడేది లేదని ముఖ్య అతిథి వచ్చేవరకు ఆవిష్కరణ చేసేది లేదని వారు పేర్కొన్నారు పోలీసులు కావాలని ఆయనను నిర్బంధించి కస్టడీలోకి తీసుకోవడం అన్యాయమని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బైంసా గ్రామీణ సీఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కుంటాల కుబీర్ ప్రత్యేక బలగాలతో ఉదయం నుండి సాయంత్రం వరకు పోలీసులు ప్రతిష్ట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మార్చుకోవాలి
రాజాసింగ్ ను అడ్డుకోవడం సరికాదు

కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మార్చుకోవాలని రాబోయే జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో ఓటమి భయంతోనే శాంతియుతంగా చేసుకునే సమయంలో రాజాసింగ్ అక్రమంగా అరెస్టు చేయించడం ప్రభుత్వం కుట్ర అని వారు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అరెస్టుల పర్వం మళ్ళీ మొదలైందని గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా అక్రమ అరెస్టులతో కేసులు బనాయించారని దేనికి భయపడేది లేదని ప్రభుత్వం ఎన్ని కుట్రలు పడిన గోషా మాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఓలా గ్రామానికి ఆహ్వానించి విగ్రహం ఆవిష్కరణ చేసేంతవరకు తాము ఊరుకోబోమని వారు తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షుడు సిందే లింగారం పటేల్ జక్కుల గజేందర్ కట్ట రవి కుబీర్ రాజన్న బిజెపి నాయకులు సదాశివ్ పటేల్ సాధు ప్రభాకర్ కుస కమల్ తాటి శివ బిజెపి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply