Jainoor | గ్రామ సమస్యలపై దృష్టి సారించాలి : చైర్మన్

Jainoor | జైనూర్, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీల సమస్యలపై సర్పంచులు వార్డు సభ్యులు దృష్టి సారించాలని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాత్ రావు అన్నారు. ఆయన పవర్ గూడా సర్పంచ్ తొడసం రాజేందర్ తో కలిసి ఆదివారం కొమరం భీ0 అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పవర్ గూడ పంచాయతీలో రోడ్ల మరమ్మత్తు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవర్ కూడా ప్రధాన రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులకు ప్రజలకు ఇబ్బందులు కలగడంతో సర్పంచ్ గుంతల పూడిక పూడ్చివేత రోడ్డు ఇరువైపులా మరమ్మత్తు పనులు చేయించడం సంతోషకరమని అన్నారు. యువ సర్పంచ్ గా రాజేందర్ పంచాయతీ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పంచాయతీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ చిన్న వయసులోనే సర్పంచ్ గా ప్రజల మన్ననలు పొందాలని చైర్మన్ విశ్వనాథ్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అబ్దుల్ ముఖిద్, పవర్ గూడ గ్రామ పటేల్ తొడస0 గంగారం, పంచాయతీ కార్యదర్శి బి భరత్, ఉయిక న్యానేశ్వర్, నాయకులు మెస్రం అంబాజీరావు, కనక రాంజీ, మాణిక్ రావు, కనక భీమ్రావు, గ్రామస్తులు పాల్గొన్నారు.
