Vijayawada | ఇంద్రకీలాద్రి పై శాస్త్రోక్తంగా సూర్యోపాసన పూజ..

Vijayawada | ఇంద్రకీలాద్రి పై శాస్త్రోక్తంగా సూర్యోపాసన పూజ..
Vijayawada, ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రి పై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం సూర్యోపాసన పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ వైదిక కమిటీ వేద పండితులు అత్యున్నత స్థాయిలో ఈ సూర్యోపాసన పూజను జరిపించారు. లోక కళ్యాణం కోసం, భక్తుల ఆరోగ్య ప్రాప్తి కోసం వేద మంత్రోచ్ఛారణల మధ్య సూర్య భగవానుడికి ప్రత్యేక అర్చనలు, నమస్కారాలు నిర్వహించారు. ఈ పవిత్ర క్రతువులో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆదివారాల్లో సూర్యోపాసన చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని పండితులు పేర్కొన్నారు.
