హాస్టల్ బాలికలపై పైశాచికం ఫలితం

హాస్టల్ బాలికలపై పైశాచికం ఫలితం

తిరుపతి క్రైమ్ , ఆంధ్రప్రభ : మైనర్ బాలికల హాస్టల్ విద్యార్థుల పట్ల వాచ్‌మెన్‌ పైశాచిక ఆనందం ఆలస్యంగా వెలుగుచూసింది. తిరుపతిలోని చెన్నారెడ్డి కాలనీలో ప్రభుత్వ సంక్షేమ హాస్టల్‌ వాచ్‌ మెన్‌ హరిగోపాల్‌(Watchman Harigopal) హాస్టల్‌ విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. అర్ధరాత్రి విద్యార్థులను బలవంతంగా గదికి పిలిపించుకుని నీలిచిత్రాల చూపించి వికృత చేష్టలు చేసి లైంగిక వేధింపులు చేసేవాడు..

బాలికలు ఎవరికి చెప్పుకోలేక తెలియక వారిలో వారే కృంగిపోయేవారు. బాలికలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. వాచ్‌ మెన్‌ బాలిక లైంగిక వేధింపులపై వార్డెన్‌ ముని శంకర్‌ దృష్టికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు.బాధితుల పిర్యాదుతో పోలీసులు(Police) ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించిన వాచ్‌మెన్ హరి గోపాల్‌ను అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. అలాగే ఆయనను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించుటకు అవసరమైన చర్యలు చేపట్టట్టారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆర్. ముని శంకర్‌‌(Hostel Welfare Officer R. Muni Shankar)ను సైతం సస్పెండ్ చేశారు. అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్యామ సుందర్ రావుకు మెమో జారీ చేశారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో పర్యవేక్షణ, భద్రతా చర్యలను బలోపేతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.