కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

కుంటాల, ఆంధ్రప్రభ : పేదింటి ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వరం అని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. శనివారం మండల కేంద్రమైన కుంటాల రైతువేదికలోని 37 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరు కావడంతో వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు నియోజకవర్గంలోని పెండింగ్ లేకుండా అందిస్తున్నామని తెలియజేశారు. అధికారులకు సైతం పెండింగ్ లోని ఉన్న కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను వెంటనే పరిష్కరించాలని తెలియజేశారు. అదేవిధంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిన ఇంతవరకు ప్రభుత్వం ఇవ్వడం లేదని ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామని ఆయన తెలిపారు. అదే విధంగా దౌనెల్లి సూర్యాపూర్ గ్రామాల్లో సిగ్నల్ సమస్య ఉండడంతో ఆ గ్రామాలకు బిఎస్ఎన్ఎల్ ద్వారా టవర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని మంజూరు పత్రాలను సైతం ఆయన ఇచ్చారు. అదేవిధంగా గ్రామాల అభివృద్ధికి శశ్యామలంగా కృషి చేస్తానని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఆడే కమల్ సింగ్, ఎంపీడీవో అల్లాడి వనజ, స్థానిక సర్పంచ్ జక్కుల గజేందర్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు సిందే లింగారం పటేల్, స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply