CM Revanth | వికారాబాద్ పర్యటన…

CM Revanth | వికారాబాద్ పర్యటన…
Telangana CM | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ వికారాబాద్ (Vikarabad) లో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అనంతగిరి హిల్స్ చేరుకోనున్నారు. హరిత రిసార్ట్స్ (haritha resorts) లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణా తరగతులు జరుగనున్నాయి. తరగతుల ప్రారంభం కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరుకానున్నారు. సాయంత్రం 4గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.
