పౌష్టికాహారం అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

ఊర్కొండ,ఆంధ్రప్రభ ; పౌష్టికాహారం అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు రమేష్ నాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని గుడ్లగుంటపల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో చిన్నారులతో పాటు గర్భిణీలు బాలింతలకు పౌష్టిక ఆహారం అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే ప్రజలకు కావలసినటువంటి సకల సౌకర్యాలతో పాటు సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నదని అన్నారు. అందులో భాగంగానే గ్రామాల్లో ఉన్నటువంటి మహిళ తల్లులకు గర్భిణీలు బాలింతలతో పాటు చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తుందని ఈ అవకాశాలను అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ రజని, ఉపసర్పంచ్ కొండలు తదితరులు ఉన్నారు.

Leave a Reply