సీఎం సహాయనిధి పేదలకు అండ: సర్పంచ్ శైలజ శ్రీశైలం
ఊర్కొండ, ఆంధ్రప్రభ : ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తుందని నర్సంపల్లి సర్పంచ్ పులిమామిడి శైలజ శ్రీశైలం తెలిపారు.
మండలంలోని నర్సంపల్లి గ్రామానికి చెందిన చిమ్మల రాఘుమారెడ్డికి జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సహకారంతో సీఎం సహాయనిధి నుంచి రూ.27,000 చెక్కును మంగళవారం గ్రామ సర్పంచ్ శైలజ శ్రీశైలం, కాంగ్రెస్ నాయకులు కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి ఆపద సమయంలో సీఎం సహాయనిధి తోడ్పాటును అందిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వీరెడ్డి వెంకట్ రెడ్డి, చిమ్ముల తిరుపతి రెడ్డి, వెంకట్ రెడ్డి, నిరంజన్, జంగయ్య, సీతమ్మ, బుక్ కీపర్ పరమేశ్వరి, గ్రామస్తులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
