ఈనెల 22న పెరికకుల సంఘం జిల్లా సమావేశం..

కడెం (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : కడెం మండలంలోని కొండుకూరు గ్రామంలోని శివ వెంకట సాయి రైస్ మిల్ వద్ద ఈ నెల 22న ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ పెరికకుల సంఘం నిర్మల్ జిల్లా సమావేశం, పెరికకుల సంఘం జిల్లా నూతన కార్యవర్గం మండల కార్యవర్గం ఎన్నుకోవడం జరుగుతుందని పై సమావేశంలో అధిక సంఖ్యలో పెరికకుల సంఘం కులస్తులు పాల్గొని విజయవంతం చేయాలని పెరికకుల సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు చుంచు భూమన్న పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రమైన కడెంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజయకుమార్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సుంకరి ఆనంద్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కే విజయ్ కుమార్ రాష్ట్ర భవన నిర్మాణ కమిటీ ఉపాధ్యక్షులు ఉమ్మడి ఆదిలాబాద్ మాజీ జిల్లా జెడ్పి చైర్మన్ చుంచు ఉషన్న హాజరవుతున్నారని ఆయన తెలిపారు. పై సమావేశంలో నిర్మల్ జిల్లాలోని పెరికకుల సంఘం నాయకులు కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Leave a Reply