ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ 396 జయంతి

చిట్యాల, ఆంధ్రప్రభ : భారతీయ పరాక్రమానికి ధైర్య సాహసాలకు నిలువుటద్దాం స్వరాజ్య -స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వేడుకులను నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధి చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో అత్యంత వైభవంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ 396 జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ హాజరై శివాజి విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం దైద రవీందర్ మాట్లడుతూ అన్యాయానికి వృతిరేఖంగా పోరాడి పైందవ ధర్మాన్ని రక్షించిన గొప్ప వీరుడు అని, పరిపాలన దక్షత, గెరిల్లా యుద్ధ తంత్రలు నేటి తరానికి ఎంతో స్ఫుర్తిదాయకమని అన్నారు.
దేశంకోసం ధర్మాన్ని రక్షించడానికి నేటి యువతి, యువకులు పోరాటం చేయల్సిన అవసరమంందని, స్త్రీలను గౌరవించని రాజ్యానికి భవిష్యత ఉండదని వారు అన్నారు. అపరమైన మొఘలుల సైన్యన్ని తన గే్రిల్లా యుద్ధ తంత్రాలతో గడగడాలలించిన ధైర్యశాలి శివాజీ అఫ్జల్ ఖాన్ ను అంతం చేయడం ఆగ్రా కోట నుండి తప్పించుకోవడం అయన ధైర్య సాహసలకు నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గార్ల పార్టీ రవీందర్ రెడ్డి ఆరెగూడెం సర్పంచ్ నాగం పల్లి శ్యాంసుందర్ గ్రామ శాఖ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి నాయకులు రాముడు దశరథ శ్రీను ఒంటె పాకం నక్షత్ మహేష్ సతీష్ మోహన్ సైదులు సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
