నెలలో మూడవ గురువారం ప్రభుత్వ ఆసుపత్రుల్లో శ్రమదానం చేపట్టాలి..

జూలూరుపాడు, ఆంధ్రప్రభ ; ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆవరణ,పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు వైద్య సిబ్బంది,ఆశా కార్యకర్తలు గురువారం శ్రమదానం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది,ఆశా కార్యకర్తలు శ్రమదానంలో పాల్గొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని పరిసరాలను శుభ్రపరిచేందుకు నెలలోని మూడవ గురువారం వైద్య సిబ్బంది శ్రమదానం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశించారు.జూలూరుపాడు పిహెచ్సి ఆవరణలోనీ వ్యర్థాలు,చెత్త చెదారం, పిచ్చి మొక్కలను తొలగించి,చీపుర్లతో ఊడ్చి ప్రాంగణాన్ని శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్యురాలు డాక్టర్ తేజస్విని,హెల్త్ సూపర్వైజర్ రాధిక,కృష్ణ,ఏఎన్ఎంలు,ఆశా కార్యకర్తలు శ్రమదానంలో పాల్గొన్నారు.

Leave a Reply