Celebrations | ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

Celebrations | భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదిన భీంగల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ….తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ చేసిన ఉద్యమం, చూపిన పట్టుదల, నాయకత్వం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, రైతు సంక్షేమం మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రజల జీవితాలలో కీలక మార్పులు తీసుకొచ్చాయని పేర్కొన్నారు.
కేసీఆర్ కు దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన చూపిన అభివృద్ధి మార్గంలో రాష్ట్రం మరింత ముందుకు సాగాలని మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు దొనకంటి నర్సయ్య, మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ ఆర్మూర్ మహేష్, చౌట్పల్లి రవి, ఉపాధి నర్సయ్య, నీలం గంగాధర్, శర్మ నాయక్, బోర్ లింగం, శెవ్వ అశోక్, గోపి, తుక్కాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
