construction | నిర్దేశిత కాల పరిమితిలో పూర్తి చేయాలి

construction | నిర్దేశిత కాల పరిమితిలో పూర్తి చేయాలి
- జిల్లా కలెక్టర్ అన్సారియా ఆదేశం
construction | గుంటూరు, ఆంధ్రప్రభ : గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు నిర్దేశిత కాల పరిమితిలో పూర్తి అయ్యేలా నిర్మాణ కాంట్రాక్ట్ ఏజెన్సీ ని సమన్వయం చేసుకుంటూ ఆర్ అండ్ బి, నగరపాల సంస్థ అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. మంగళవారం శంకర్ విలాస్ ఆర్వోబి నిర్మాణ పనులను, ఏటుకూరు రోడ్ లోని కంపోస్ట్ యార్డు ను జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లర్ల నిర్మాణం, డ్రైనేజీ ల నిర్మాణం తదితర ఇతర నిర్మాణాలు ప్లానింగ్ లో నిర్దేశించిన సమయానికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్మాణ ఏజెన్సీకి సూచించారు. వర్షాకాలంలో ఇబ్బందులు లేకుండా మే నెల చివరి నాటికి బ్రిడ్జికి ఇరువైపులా డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. నిర్మాణ ప్రాంతంలో అడ్డంగా ఉన్న విద్యుత్ పోల్స్ ను పక్కకు తరలించాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు.

నిర్మాణ ఏజెన్సీకి పనులు సజావుగా నిర్వహించుకునేలా ఆర్ అండ్ బి నగరపాలక సంస్థ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఏటుకూరు రోడ్ లోని కంపోస్ట్ యార్డు లో ఎంఆర్ఎఫ్, విండ్రో, వర్మి కంపోస్ట్ యూనిట్స్, వేస్ట్ రీ సైక్లింగ్ పాయింట్స్, నిర్మాణంలోని గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ (జిటిఎస్) లను పరిశీలించారు. నగరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్ధాలతో ఏటుకూరు పాయింట్ లో 50 టన్నుల విండ్రో, 35 టన్నుల వర్మి కంపోస్ట్ ని తయారు చేస్తున్నామని, వీటి సామర్ద్యాలను పెంచుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
వచ్చిన ఎరువును కిచెన్ గార్డెన్ నిర్వహకులు, జిఎంసి పార్క్ లు, డివైడర్లపై మొక్కలుకు వేస్తున్నామని కమిషనర్ కె.మయూర్ అశోక్ జిల్లా కలెక్టర్ కు తెలిపారు. 10 టన్నుల సామర్ధ్యం కల్గిన మెటీరియల్ రికవరీ ఫెసిలిటి కేంద్రం (ఎంఆర్ఎఫ్) ద్వారా ప్లాస్టిక్ ని రీ సైక్లింగ్ చేస్తున్నామని, గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ నిర్మాణం పనులు త్వరలోనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురానున్నామని కలెక్టర్ కు వివరించారు. వ్యర్ధాల నుండి ఎరువు తయారీని మరింతగా పెంచాలన్నారు.
ప్రతి రోజు వచ్చే వ్యర్దాలను సమర్దవంతంగా నిర్వహిస్తే పర్యావరణ హితంగా వ్యర్థాల సమస్యను పరిష్కరించవచ్చన్నారు. వ్యర్థాలను తడి, పొడిగా వేరు చేసి తడి చెత్తతో ఎరువు, పొడి చెత్తని రీ సైక్లింగ్ చేయడం బాగుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె. శ్రీనివాస రావు, నగర పాలక సంస్థ ఎస్ఈ వెంకటేశ్వరరావు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతి కళ, డిసిపీ సూరజ్ కుమార్, ఏసిపీ రెహ్మాన్, ఈఈలు విష్ణు, వేణు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ అనిల్ కుమార్, ఆర్ అండ్ బీ, విద్యుత్, శంకర్ విలాస్ ఆర్వోబి నిర్మాణ పనులు నిర్వహిస్తున్న ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.
