పేదలకు నాణ్యమైన వైద్య సేవలు…

పేదలకు నాణ్యమైన వైద్య సేవలు…
నాదెండ్ల, ఆంధ్రప్రభ : చిరుమామిళ్ల గ్రామం తో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకే చిరుమామిళ్ల గ్రామంలో ప్రభుత్వం నడికట్టు రామిరెడ్డి హెల్త్ ప్రైమరీ 30 పడకల వైద్య శాలను నిర్మిస్తున్నారని చిరుమామిళ్ల విద్య గ్రామాభివృద్ధి ప్రదాత గోల్కొండ గ్రూప్ సంస్థల చైర్మన్ నడికట్టు రామిరెడ్డి అన్నారు. చిరుమామిళ్లలో శనివారం నడికట్టు రామిరెడ్డి హెల్త్ ప్రైమరీ 30 పడకల వైద్యశాల నిర్మాణ పనులు ప్రారంభించే సందర్భంగా ఏర్పాటుచేసిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ ఏడాది లోపే ఈ వైద్యశాలను నిర్మించి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ఈ వైద్యశాల ద్వారా పేదలకు వైద్య సేవలు అందించడం జరుగుతుంది అన్నారు. ఈ వైద్యశాల నిర్మాణానికి తన సొంత నిధులతో 2.70 ఎకరంలు భూమిని కొనుగోలు చేసి వైద్యశాల నిర్మాణానికి ప్రభుత్వానికి అందజేయడం జరిగిందన్నారు. ఈ వైద్యశాల నిర్మాణానికి తన వంతు 5 కోట్ల రూపాయలు సహకారం అందిస్తున్నాను అన్నారు.

వైద్యశాల నిర్మాణం పూర్తయితే చిరుమామిళ్ల గ్రామం తో పాటు చుట్టుపక్కల గ్రామాల వారికి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి అన్నారు. చిరుమామిళ్ల గ్రామానికి ఈ వైద్యశాల నిర్మాణంతో అన్ని మౌలిక సదుపాయాలు సమకూరినట్లే అన్నారు. గ్రామీణ ప్రాంతంలో 30 పడకల ప్రైమరీ హెల్త్ సెంటర్ చిరుమామిళ్ల గ్రామంలోనే నిర్మించడం జరుగుతుంది అన్నారు. గ్రామీణ ప్రాంతంలో 30 పడకల వైద్యశాల ఎక్కడ లేదు అన్నారు.
మరి కొద్ది రోజుల్లోనే గ్రామం చుట్టుపక్కల గ్రామాల వారి అవసరాలు తీర్చేందుకు యూనియన్ బ్యాంక్ కి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు చిరుమామిళ్ల గ్రామస్తులు బ్యాంకు సేవలు కోసం నాదెండ్ల, సాతులూరు గ్రామాలకు వెళ్ళవలసి వస్తుంది అన్నారు దీంతో రైతులు, మహిళలు పనులు మానుకొని బ్యాంకు సేవలు కోసం పరుగు గ్రామాలకు ఎన్నో కష్టాలు పడి వెళ్ళవలసి వస్తుంది అన్నారు. బ్యాంకు ఏర్పాటు అయితే చిరుమామిళ్ల గ్రామమే కాక చుట్టుప్రక్కల ఉన్న జంగాలపల్లి, సంక్రాంతి పాడు, గ్రామాలు కూడా బ్యాంకు సేవలు అందుబాటులోకి వస్తాయి అన్నారు.
ముందుగా అతిథ గృహం వద్ద నుండి ర్యాలీగా వైద్యశాల నిర్మించే వరకు వెళ్లి భూమి పూజ కార్యక్రమం లో పాల్గొని భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు, పూజారులు శంకర్రావు శర్మ, వేముల రావు శర్మ, దరువురి వంశీ బొకే అందజేసి పూలమాల వేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో శ్యామల వెంకటరెడ్డి, యన్నం శివారెడ్డి, గాదే బ్రహ్మారెడ్డి, శ్యామల సామిరెడ్డి, భాస్కర్ భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి, అయినవోలు రాధా కృష్ణమూర్తి, పొలిమేర వెంకటరెడ్డి, కొమ్మ కమలాకర్ రెడ్డి, హెచ్ఎంలు మేకల కిషోర్, శ్రీనివాసరావు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
