schools | పాఠశాలల మూసివేతను వెంటనే విరమించుకోవాలి:

schools | పాఠశాలల మూసివేతను వెంటనే విరమించుకోవాలి:
- డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జక్క రామస్వామి
schools | అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలం, హాజీపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డిటిఎఫ్) అచ్చంపేట మండల శాఖ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జక్క రామస్వామి హాజరై మాట్లాడారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 25ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రేషనలైజేషన్ పేరుతో గ్రామాలు, తండాలలోని ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం సరైంది కాదని అన్నారు.
పాఠశాలల విలీనాలు, మూసివేతల బదులు ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించి, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ఒక తరగతి గది ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పేద వర్గాల పిల్లలకు నైపుణ్యంతో కూడిన గుణాత్మక విద్య అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డిటి నాయక్ మాట్లాడుతూ రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.
మోతీరాం మాట్లాడుతూ విద్యారంగంలో చేపడుతున్న మార్పులు పేద వర్గాలకు అనుకూలంగా ఉండేలా శాస్త్రీయమైన, సమాన విద్యను అందించే విధంగా ఉండాలని పేర్కొన్నారు. కే. నర్సింహులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేస్తూ ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఉప్పునుంతల మండల జిల్లా కౌన్సిలర్ కే. శంకర్ రాథోడ్, బల్మూరు మండల డిటిఎఫ్ అధ్యక్షులు కే. నాగరాజు పాల్గొన్నారు. అనంతరం అచ్చంపేట మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అధ్యక్షులుగా ఎం. విజయ్‌కుమార్, ఉపాధ్యక్షులుగా ఎన్. గోపాలమ్మ, శంకర్, ప్రధాన కార్యదర్శి గా జి. ప్రవీణ్‌కుమార్, కార్యదర్శులుగా పి. రామాంజలి, విజయశాంతి, ఖాదర్ పాషా, ఎన్. జోత్స్న, జిల్లా కౌన్సిలర్లుగా కే. నరసింహులు, జె. మోతీరామ్, ఎస్. నాగేశ్వరరావు, ఆడిట్ కమిటీ కన్వీనర్గా పి. కృష్ణవేణి, సభ్యులుగా రాజు, పి. కృష్ణయ్య లను ఎన్నుకున్నారు.
