Thanks | మోత్కూర్ ని సుందర నగరంగా తీర్చి దిద్దుతాము..!

Thanks | మోత్కూర్ ని సుందర నగరంగా తీర్చి దిద్దుతాము..!

ఎమ్మెల్యే ,ఎంపీ ల ఆశీర్వాదం తో
మున్సిపల్ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం
6 వ వార్డ్,పట్టణ ప్రజలకు రుణపడి ఉంటా..!

Thanks | మోత్కూర్, ఆంద్రప్రభః మోత్కూర్ మున్సిపాలిటీ ని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ల ఆశీర్వాదంతో సుందర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని నూతన మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య అన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తన చైర్మన్ నియమాకానికి సహకరించిన 6 వార్డ్ ఓటర్లు, నాయకులు,పట్టణ ప్రజలకు తాను ఎల్లవేళలా రుణపడి ఉంటానని..ఎమ్మెల్యే, ఎంపీ ల సహకారంతో మోత్కూర్ ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు. నిరుపేద,ఓ సామాన్య కుటుంబం నుండి వచ్చిన తాము నిరంతరం ప్రజల శ్రేయస్సు లక్ష్యంగా పని చేస్తామని అన్నారు.మోత్కూర్ అభివృద్ధి లో రాజకీయాలకు అతీతంగా తమకు సహకరించాలని కోరారు. నూతన పాలకవర్గం సహకారంతో మున్సిపాలిటీ ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు. తమ పై నమ్మకం తో చైర్మన్ పదవిని అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, రాష్ట్ర, జిల్లా, మండల,మున్సిపల్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply