26న కూరగాయల సంత వేలం పాట..

26న కూరగాయల సంత వేలం పాట..

చిట్యాల సర్పంచ్ తౌటం లక్ష్మి,

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే కూరగాయల సంత వేలంపాట, ఈనెల 26న నిర్వహిస్తున్నట్లు చిట్యాల గ్రామ సర్పంచ్ తౌటం లక్ష్మి సోమవారం తెలిపారు. చిట్యాల గ్రామపంచాయతీ పరిధిలో 2026- 27 సంవత్సరమునకు ఈ నెల 26 గురువారం ఉదయం 10 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు చిట్యాల లో ప్రతి సోమవారం జరుగు కూరగాయల సంతలో కూరగాయలు అమ్ముకునే వ్యాపారస్తుల నుండి నుండి దుకాణం చీటీ వసూలు చేసుకొనుటకు బహిరంగ వేలం నిర్వహించబడును. పై ప్రకటనలో పొందుపరిచిన నిబంధనల మేరకు ఆసక్తి కలిగిన వారు పాల్గొని విజయవంతం చేయాలని సర్పంచ్ లక్ష్మి కోరారు.