Govt | వేసవిలో నీటిఎద్దడి తలెత్తకుండా…

Govt | వేసవిలో నీటిఎద్దడి తలెత్తకుండా…

Govt | ఊట్కూర్, ఆంధ్రప్రభ : వేసవి కాలంలో గ్రామంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు వహించి ప్రజలకు నీరు అందజేసే విధంగా చూస్తాననిబిజ్వార్ సర్పంచ్ కొల్లంపల్లి అంజయ్య అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ బీసీ కాలనీలో బోరు మరమ్మతు పనులు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బీసీ కాలనీలో గత కొన్ని ఏళ్ల నుండి బోరు మరమ్మతు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని నీటి సమస్య లేకుండా చేయడమే తన లక్ష్యమన్నారు.

గ్రామంలో ఎంపీ నిధులతో హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేశామని రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వా నిధులు తీసుకువచ్చి గ్రామ సర్వతో ముఖాభివృద్ధికికృషిచేస్తానని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలుచేసి అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేసే విధంగా చూస్తానని అన్నారు. గ్రామంలో డ్రైనేజీలు సిసి రోడ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఏడవ వార్డులో మట్టి రోడ్డు పనులు చేపడుతున్నామని అన్నారు. అఖిలపక్షం నాయకులతో కలిసిగ్రామాభివృద్ధికి పాటుపడుతాననిఅన్నారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఆంజనేయులుగౌడ్, చెన్నారెడ్డి, తులసీదాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply