అయ్యప్ప ఆలయంలో షెడ్డు నిర్మాణ పనులు ప్రారంభం..
మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నూతన షెడ్డు నిర్మాణం పనులను ఇవాళ రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ప్రారంభించారు. మంత్రి ప్రత్యేక నిధులు రూ.36 లక్షలతో చేపడుతున్న షెడ్డు నిర్మాణ పనులకు ఆలయ కమిటీ సభ్యులతీ కలిసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అయ్యప్ప భక్తులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి షెడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించడం జరిగిందన్నారు.రానున్న కార్తీకమాసం అయ్యప్ప మాలధారణ దీక్షా సమయంలోగా షెడ్డును పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని మంత్రి సూచించారు.
ప్రతి ఏడాది అయ్యప్ప మాల ధరించే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆధ్యాత్మిక చింతనతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. ఆలయ సందర్శనం ఆధ్యాత్మిక ప్రవచనాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు.రానున్న రోజుల్లో మరికొన్ని వసతులు కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వాకిటి మానస హన్మంతు, కౌన్సిలర్ శ్రీవిద్య నీలాగౌడ్,అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు తాళంపల్లి అనిల్ కుమార్, అశోక్ గౌడ్ ,చంద్రకాంత్ గౌడ్, పాదయాత్ర రాజు, కాంగ్రెస్ నాయకులు కట్ట సురేష్ కుమార్ గుప్తా, బి .గణేష్ కుమార్, బోయ రవికుమార్ ,వల్లంపల్లి లక్ష్మణ్, రంజిత్ రెడ్డి, కావలి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
