బీద కుటుంబం నుంచి చైర్మన్ పీఠం వరకు..!

బీద కుటుంబం నుంచి చైర్మన్ పీఠం వరకు..!
కుటుంబానికి పెద్దదిక్కుగా నిలిచిన వినయ్
విద్యను ఆయుధంగా మార్చుకున్న యువ నేత
ప్రజా సేవే లక్ష్యంగా రాజకీయాల్లో అడుగులు
ప్రజల నమ్మకమే బలం చైర్మన్‌గా ఘన విజయం
కష్టాలపై గెలిచి చైర్మన్ పీఠాన్ని అధిరోహించిన యువ నాయకుడు
నేటి యువ నాయకత్వానికి ఆయన ఎదుగుదల నిదర్శనం
నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్(సన్నీ )విజయగాథ ఇది..
స్టేషన్ ఘన్ పూర్ ఫిబ్రవరి16 ఆంధ్రప్రభ: బీద కుటుంబం నుంచి వచ్చిన ఓ యువకుడు…కష్టాలను ఎదుర్కొంటూ ఎదిగగి ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అధిరోహించిన కథ ఇది. స్టేషన్ ఘన్పూర్ పట్టణ కేంద్రానికి చెందిన తాటికొండ వినయ్ కుమార్ (సన్నీ) జీవితం నిజంగా ప్రేరణాత్మకం.
కుటుంబానికి ఆయనే పెద్దదిక్కుగా…
1992 మే 29న కానిస్టేబుల్‌గా పనిచేసిన తాటికొండ వీరస్వామి ఎలీషా దంపతులకు జన్మించిన వినయ్ కుమార్ చిన్ననాటి నుంచే కష్టసుఖాలు అనుభవించారు.ఆ దంపతులకు ఇద్దరు కుమారులు వినయ్ కుమార్ (సన్నీ), అజయ్ (అఖిల్), ఒక కుమార్తె షర్మిల ఉన్నారు. దాదాపు 15 ఏళ్ల క్రితం తండ్రి, 10 ఏళ్ల క్రితం తల్లి మర ణించడంతో కుటుంబ బాధ్యతలన్నీ వినయ్ కుమార్ భుజాలపై పడ్డాయి. ఆ సమయంలోనే ఆయన పెద్దదిక్కుగా తమ్ముడు, చెల్లెకు నిల బడ్డాడు. తమ్ముడు, చెల్లె కు పెద్దదిక్కుగా నిలబడి కుటుంబాన్ని ఆదుకున్నారు.

ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి…
వినయ్ కుమార్ బీద కుటుంబానికి చెందినప్పటికీ విద్యను ఆయుధం గా ఎంచుకున్నారు. హైదరాబాద్‌లో బి.ఏ. ఎల్.ఎల్.బి పూర్తి చేసి ఉన్న త విద్య సాధించారు. చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ, ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. గత మూడేళ్ల క్రితం వినయ్ కుమార్ కు శ్వేతతో వివాహం అయింది. ఒక కుమారుడు ఉన్నారు. ఇటీవల తమ్ముడి వివాహం కూడా జరిపించి కుటుంబాన్ని స్థిరపరిచారు. వ్యక్తిగత జీవితంలో బాధ్య తాయుతుడిగా, సమాజంలో సేవాభావంతో ముందుకు సాగే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు.

ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం…
స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో 13వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా బరిలోకి దిగిన వినయ్ కుమార్ ప్రజల విశ్వాసాన్ని సొంతం చేసుకు న్నారు. మొత్తం 805 ఓట్లు పోలింగ్ కాగా, అందులో 596 ఓట్లు ఆయ నకు లభించాయి. 369 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ ఫలితం ఆయనపై ప్రజలు ఉంచిన నమ్మకానికి నిదర్శనం. యువ నాయకత్వం, ఉన్నత విద్య, ప్రజలతో కలిసిమెలిసి ఉండే స్వభావం ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. ప్రజా సమస్యల పరిష్కా రమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగిన ఆయన విజయం సాధించడం తో తోటి కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆయనను మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు.

-ప్రజా సేవే లక్ష్యం: మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్..
ప్రజల సమస్యల పరిష్కారమే నా ప్రధాన లక్ష్యం. అందరి సహకారంతో స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నా రు.మొత్తానికి సాధారణ కుటుంబం నుంచి వచ్చి కష్టాలను జయించిన ప్రజా నాయకుడిగా ఎదిగిన వినయ్ కుమార్ విజయగాథ స్థానిక యువ తకు స్ఫూర్తి గా నిలుస్తోంది. 13వ వార్డు నుంచి చైర్మన్ పీఠం వరకు ఆయన ప్రయాణం పట్టుదల, సేవాభావం, ప్రజల ఆశీర్వాదం కలిసొచ్చిన విజయకథగా నిలిచింది.


