Mini van | డ్రైవర్ కు గాయాలు

Mini van | డ్రైవర్ కు గాయాలు

  • అర‌గంట పాటు ట్రాఫిక్ జామ్

Mini van | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : కొబ్బ‌రిబోండాల‌తో వెళ్తున్న మినీ ఆటో బోల్తాప‌డిన ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఆంధ్ర నుంచి కొబ్బరి బొండాలతో కరీంనగర్‌కు వస్తున్న మినీ ఆటో బోల్తా పడిన సంఘటన ఇవాళ‌ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి రాజీవ్ రహదారిపై చోటు చేసుకుంది.

స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఆంధ్ర నుంచి టీజీ 27 టి 0524 గల మినీ వ్యాన్ కరీంనగర్ కు కొబ్బరి బొండాలను లోడ్ చేసుకొని కరీంనగర్ కు వస్తుండగా ఎల్ఎండి వద్ద ఎక్సెల్ విరిగిపోవడంతో అదుపుతప్పి డివైడర్ దాటి హైదరాబాద్ వైపు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ రాజుకు గాయాలయ్యాయి. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు నిత్యం రద్దీతో ఉండే రహదారిపై ప్రమాదం జరగడంతో అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది.

Leave a Reply