HYD | రూ.15లక్షలు పోగొట్టుకొని…

HYD | రూ.15లక్షలు పోగొట్టుకొని…
HYD | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బెట్టింగ్ భూతం మరో యువకుడి జీవితాన్ని బలి తీసుకుంది. హైదరాబాద్ కూకట్‌పల్లిలో వెంకటేశ్వర్ రెడ్డి అనే యువకుడు ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లో రూ.15 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ భారీ నష్టంతో మనస్తాపం చెందిన వెంకటేశ్వర్ రెడ్డి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బెట్టింగ్ కు అలవాటు పడిన వారిలో ఆర్థిక నష్టాలు, మానసిక ఒత్తిడి, కుటుంబ గొడవలు, ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఘటన మరో హెచ్చరికగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
బెట్టింగ్ యాప్‌లు, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వల్ల యువత జీవితాలు నాశనమవుతున్నాయన్న వాస్తవాన్ని ఈ ఘటన మరోసారి బయటపెట్టింది.
