Gold| వివాహాల వేళ బంగారం లాంటి న్యూస్

Gold| వివాహాల వేళ బంగారం లాంటి న్యూస్
- ధరలు తగ్గాయోచ్..
- తగ్గిన బంగారం, వెండి రేట్లు
- ఊపిరి పీల్చుకుంటున్న సామాన్యులు
ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : గత కొన్ని రోజులుగా పసిడి ధరలు పరుగులు పెట్టాయి. ఆకాశమే హద్దుగా రేట్లు పెరగడంతో కొనుగోలుదారులు బంగారం కొనడానికి వెనుకడుగు వేశారు. బంగారంతోపాటు వెండి ధరలు కూడా పోటీ పడ్డాయి. వాటి ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడిప్పుడే రేట్లు నేలచూపు చూస్తుండటంతో విక్రయదారులకు కొంత ఉపశమనం కలిగింది. అసలే పెళ్లిళ్ల సీజన్ మొదలవుతోంది. ఈ సమయంలో బంగారం ధర తగ్గడంతో శుభకార్యాలు చేసేవారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బంగారం ధరల తగ్గుదల సామాన్య కొనుగోలుదారులకు, పెళ్లిళ్ల కోసం నగలు చేయించుకునే వారికి పెద్ద ఊరటనిస్తోంది.

ఈ రోజు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,58,400 ఉండగా.. నేడు శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,55,780 వద్ద ఉంది. అలాగే గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,200 కాగా.. నేడు శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,800 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.2,620 తగ్గింది.
హైదరాబాద్లో ఇలా..
హైదరాబాద్లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,55,780 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,800 వద్ద ఉంది.

సిల్వర్ ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు కాకుండా సిల్వర్ ధరలు కూడా భారీగా తగ్గాయి.. నేటి సిల్వర్ ధరలు చూసుకుంటే.. గురువారం కేజీ సిల్వర్ ధర రూ. 3,00,000 ఉండగా.. శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,80,000 వద్ద కొనసాగుతోంది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో ప్రస్తుత ధర రూ. 2,80,000 వద్ద పలుకుతోంది.
